
తాజా వార్తలు
కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసం
నిందితుడి అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నానంటూ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఆస్పత్రులకు నిందితుడు ఫోన్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేటకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుగా గుర్తించారు. దాదాపు 9 కంపెనీల నుంచి రూ.39.22 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వెబ్సైట్ల ద్వారా కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్ నెంబర్లను సేకరించేవాడు. కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడు. గతంలోనూ నాగరాజు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.