close

తాజా వార్తలు

Published : 28/09/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళపై అత్యాచారం...రైల్వే ఇంజినీర్లపై వేటు!

ఇంటర్నెట్ డెస్క్‌ : ఓ మహిళ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావటంతో ఇద్దరు రైల్వే ఇంజినీర్లను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన భోపాల్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...రాజేశ్‌ తివారీ(జూనియర్‌ ఇంజినీర్‌), అలోక్‌ మాలవీయ(ఎలక్ట్రికల్ ఇంజినీర్‌)లు డబ్ల్యూసీఆర్‌ భోపాల్‌ డివిజన్‌లో ఉద్యోగులు. రాజేశ్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన ఓ మహిళతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఉంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెను అతడు భోపాల్కు రమ్మన్నాడు. దాంతో శనివారం ఉదయం ఆమె భోపాల్‌ వచ్చింది. రాజేశ్  ఆమెను భోపాల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఓ గదిలో ఉంచాడు. తరువాత మాలవీయతో కలిసి ఆమెకు డ్రింక్‌ తాగించాడు. తరువాత వారిద్దరూ ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై భోపాల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శాఖా పరమైన విచారణ చేపట్టారు. నిందితులను సస్పెండ్‌ చేశారు.   


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.