ఆ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు లేవు

తాజా వార్తలు

Published : 09/01/2020 21:19 IST

ఆ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు లేవు

దిల్లీ: పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షాలు అధికంగా పడటం వల్ల పంటలు నష్టపోయి ఇతరత్రా కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసలు రైతుల ఆత్మహత్యలే లేవని జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. 2018లో దేశవ్యాప్తంగా సుమారు 1,34,516 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో పేర్కొంది. అందులో 10,349 మంది రైతులు ఉన్నారు. 2017తో పోల్చుకుంటే 2018లో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. బిహార్‌, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, మేఘాలయ, గోవా,  డామన్‌ డయ్యూ, దిల్లీ, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలో రైతుల ఆత్మహత్యలు లేవని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. మహారాష్ట్ర (17,972), తమిళనాడు(13,896), పశ్చిమ బెంగాల్‌(13,255), మధ్యప్రదేశ్‌(11,775), కర్ణాటక(11,561) రాష్ట్రాల్లో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా రికార్డులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వారిలో సుమారు 50 శాతం మంది ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. మిగతా 49.1 శాతం మంది 24 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత తక్కువ ఆత్మహత్యలు నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని