రసాయన పరిశ్రమలో పేలుడు: ఐదుగురు మృతి

తాజా వార్తలు

Published : 12/01/2020 00:54 IST

రసాయన పరిశ్రమలో పేలుడు: ఐదుగురు మృతి

మహారాష్ట్ర: పాల్గర్‌ జిల్లా బాయిసర్‌లోని ఓ రసాయన పరిశ్రమలో శనివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించిన పరిశ్రమ ముంబయికి సమీపంలో ఉన్న తారాపూర్‌ కెమికల్‌ జోన్‌ పరిధిలో ఉంది. శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న భవనంలో కొత్త రియాక్టర్‌ను పరీక్షిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు సంభవించిన రసాయన పరిశ్రమలో అమ్మోనియం నైట్రేట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల దాదాపు 15 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్ని ఇళ్ల కిటికీలు కూడా పగిలినట్లు సమాచారం.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని