జూబ్లీహిల్స్‌లో పబ్‌పై దాడి:అదుపులో యువతులు

తాజా వార్తలు

Published : 13/01/2020 01:10 IST

జూబ్లీహిల్స్‌లో పబ్‌పై దాడి:అదుపులో యువతులు

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని టాట్‌ పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అశ్లీల నృత్యాలు జరగుతున్నాయనే సమాచారంతో ఆదివారం రాత్రి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో దాడులు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ పబ్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాడుల సమయంలో యువతీయువకులు ఉన్నప్పటికీ ఎలాంటి అశ్లీల నృత్యాలు కనిపించలేదని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అయితే కార్యక్రమానికి వచ్చిన వారి వివరాలను గుర్తింపు పత్రాలను సరిపోల్చి చూశారు. వీరిలో కొంతమంది యువతులను అదుపులోకి తీసుకుని ప్రైవేటు బస్సులో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీలో మైనర్లు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని