గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం

తాజా వార్తలు

Updated : 20/01/2020 01:30 IST

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లావాసులు ఐదుగురి దుర్మరణం

 అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం నుదుటన మరణ శాసనాన్ని లిఖించింది. ఐదుగురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. ప్రకాశం జిల్లాకు   చెందిన 10 మంది సోమ్‌నాథ్‌ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు సురేంద్రనగర్‌ జిల్లా దేవ్‌పారా గ్రామం సమీపంలో అదుపు తప్పింది. డివైడర్‌ను దాటుకొని వెళ్లి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులోని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులను చీరాలలోని జాండ్రపేటకు చెందిన కె.సుబ్రమణ్యం(43), రాజ్యలక్ష్మి(39), గణేశ్‌  (20), దుర్గాభవానీ(22), అఖిల్‌(11)లుగా పోలీసులు గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. గాయపడ్డ నాగేంద్ర ప్రసాద్‌, మాధురి, శ్రీనివాస్‌, రుచిత, డ్రైవర్‌ సోహన్‌లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని