నేపాల్‌లో విషాదం..

తాజా వార్తలు

Published : 22/01/2020 01:45 IST

నేపాల్‌లో విషాదం..

8మంది కేరళ పర్యాటకులు మృతి

కాఠ్‌మాండూ: నేపాల్‌లో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌ పర్వత ప్రాంత సందర్శనకు వెళ్లిన 8మంది కేరళ పర్యాటకులు మృత్యువాత పడ్డారు. పర్వత ప్రాంతంలో వారు దిగిన రిసార్టులో హీటర్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ కారణంగా వారు మరణించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. పోలీసులు, మీడియా వర్గాల వివరాల ప్రకారం.. కేరళకు చెందిన 15 పర్యాటకులు నేపాల్‌లోని పొఖారా పర్వత ప్రాంతంలోని పొఖారా సందర్శనకు వెళ్లారు. వారు సోమవారం రాత్రి పర్వత ప్రాంతంలోని ఓ రిసార్టులో దిగారు. గదిలో హీటర్‌ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వారిని  ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధితులను ప్రవీణ్‌ కుమార్‌ నాయర్‌(39), శరణ్య శశి(34), శ్రీభద్ర ప్రవీణ్‌(9), అభి నాయర్‌‌(7), అభినవ్‌ శరణ్య నాయర్‌(9), రంజిత్‌కుమార్(39), ఇందు రంజిత్‌(34), వైష్ణవ్‌ రంజిత్‌(2)లుగా గుర్తించారు. 

దీనిపై రిసార్టు సిబ్బందిని ఆరా తీయగా.. పర్యాటకులు వెచ్చదనం కోసం హీటర్‌ ఆన్‌ చేసి ఉండవచ్చని చెప్పారు. మొత్తం 4 గదులు తీసుకున్నప్పటికీ 8మంది ఒకే గదిలో ఉండటం గమనార్హం. ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆస్పత్రికి భారత వైద్యులను సైతం పంపినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌  దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్‌ తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని