close

తాజా వార్తలు

అజాగ్రత్త ఖరీదు ఐదేళ్ల బాలుడి ప్రాణం

కారు వెనక్కి తీస్తుండగా చక్రాల కింద పడి మృతి

మల్కాజిగిరి: ఓ బహళ అంతస్తుల భవనంలో కారును లోపల పెడుతుండగా చూపిన అజాగ్రత్త ఐదేళ్ల బాలుడి ఊపిరి తీసింది. కారు వెనుక ఎవరున్నది గమనించక పోవటం ఈ ప్రమాదానికి అసలు కారణం అయితే.. తమ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే విషయంలో పెద్దల నిర్లక్ష్యం మరో కారణం. ఈ ఘటన మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో చోటు చేసుకుంది. ఎస్సై నాగేశ్వరరావు, స్థానికుల కథనం మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా మగ్నూర్‌ మండలం వడ్‌వత్‌ గ్రామానికి చెందిన రంగప్ప ఆనంద్‌బాగ్‌ 11వ వీధిలోని వెంకటప్లాజా  భవనంలో కాపలాదారుడిగా ఆరునెలల క్రితం చేరాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు తరుణ్‌(5). ఈ బహుళ అంతస్తుల భవనంలో నివసించే జె.మనోహర్‌ సుధాకర్‌(48) ప్రైవేటు ఉద్యోగి. శుక్రవారం ఉదయం తన కారులో పనిపై బయటకు వెళ్లి తిరిగి ఉదయం 7 గంటల సమయంలో వచ్చారు. గేటు వేసి ఉండటంతో దిగి బహుళ అంతస్తుల భవనం గేటు తీసుకుని కారును లోపల పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ కాపలాదారుడు లేడు. సుధాకర్‌ కారును వెనక్కి తిప్పుతున్న సమయంలో తరుణ్‌ కారు శబ్దం విని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కారు వెనక్కి రావడాన్ని వింతగా చూస్తున్నాడు. బాలుడు బయటకు వచ్చి కారు వెనుక ఉన్న సంగతిని సుధాకర్‌ గమనించకుండా కారును వెనక్కి తీశాడు. ఈ క్రమంలోనే కారు చక్రాల కింద ఆ బాలుడు నలిగి పెద్దఎత్తున అరిచాడు. ఆ అరుపులకు తల్లిదండ్రులు బయటకు వచ్చారు. సుధాకర్‌ కారును ఆపి వచ్చి చూసేసరికి ఆ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనపై మృతుడు తండ్రి రంగప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.