close

తాజా వార్తలు

అడవికెళ్లిన వృద్ధులు అదృశ్యం

 పోలీసులు, అటవీ అధికారులు, గ్రామస్థుల గాలింపు

అదృశ్యమైన వృద్ధులు వీరే

వీరబల్లి : చీపురు పుల్లల కోసం అడవికి వెళ్లిన ఇద్దరు వృద్ధులు అక్కడ దారి తప్పారు. ఒకటిన్నర రోజు అక్కడే గడిపారు. రెండో రోజు శుక్రవారం గ్రామస్థులు, పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలించి వారిని గుర్తించి క్షేమంగా ఇంటికి చేర్చారు. కడప జిల్లా వీరబల్లి మండలంలోని ఈడిగపల్లికి చెందిన గౌనేరి రాములమ్మ(60), చెనగాని వీరనాగులమ్మ(65) అడవికెెళ్లి చీపురు పుల్లలు తెచ్చుకుని విక్రయించుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం యథావిథిగా ఇద్దరూ చీపురు పుల్లలు కోసుకు రావడానికి వెళ్లారు. భోజనం, నీరు వెంట తీసుకెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాక పోవడంతో బంధువులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి వేళలోనే గ్రామస్థులు కొందరు వెతికినా వారి జాడ కన్పించలేదు. శుక్రవారం ఉదయం నుంచి పోలీసులు, అటవీ అధికారులు, గ్రామస్థులు మళ్లీ అడవికెళ్లి గాలించారు. ఉదయం 11 గంటల సమయంలో వారు ఓ చెట్టుకింద కన్పించారు. దొరికారనే సమాచారం రావడంతో పోలీసులు అడవిలోకి ప్రైవేటు వైద్యుడు నాగయ్యను తీసుకెళ్లి చికిత్సలు చేయించారు. నీళ్లు, ఆహారాన్ని అందజేసి స్వగ్రామానికి తరలించారు. వృద్ధులను విచారించగా దారి తెలియక అడవిలోపలికి వెళ్లి పోయామన్నారు. బోద ఎక్కువగా ఉండటంతో దారి కనుక్కోలేక సుమారు 10 కిలోమీటర్లు వరకు నడిచామన్నారు. తర్వాత నడవలేక ఒక చెట్టుకింద కూర్చుని రాత్రంతా చిమ్మచీకటిలో బిక్కు బిక్కు మంటూ చలికి వణుకుతూ గడిపామన్నారు. ఒక వైపు ఆకలి.. మరో వైపు దప్పిక అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తెల్లవారే సరికి గ్రామస్థులు వెతుకుతూ రావడంతో ప్రాణం లేచి వచ్చినట్లు అయిందని వివరించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె సీఐలు సుధాకర్‌రెడ్డి, యుగంధర్‌, ఎస్సైలు భక్తవత్సలం, రామాంజనేయుడు, ప్రత్యేక సిబ్బంది, పోలీసులు, అటవీ బీట్‌ అధికారి కిరణ్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

వృద్ధురాలికి నీరు తాపుతున్న పోలీసులు


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.