ఇల్లరికం వస్తానన్నాడు.. ఇల్లొదిలి వెళ్లాడు!

తాజా వార్తలు

Updated : 30/01/2020 07:30 IST

ఇల్లరికం వస్తానన్నాడు.. ఇల్లొదిలి వెళ్లాడు!

  పెళ్లికి ఒక్కరోజు ముందు.. యువకుడు పరార్‌
  ఆగిన వివాహం, పోలీసులకు ఫిర్యాదు

ముథోల్‌, న్యూస్‌టుడే: అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి తరఫు వారు ఆ విషయంపైనా చర్చించారు. యువకుడు అందుకూ అంగీకరించడంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా రేపు పెళ్లనగా, ఒకరోజు ముందు అతను అదృశ్యం కావడంతో అందరూ అవాక్కయ్యారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో బుధవారం జరిగిన ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో, ముథోల్‌ గ్రామానికి చెందిన సంతోష్‌కు నెల రోజుల కిందట వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలోనే ఇల్లరికం వెళ్లేందుకూ అతను అంగీకారం తెలిపాడు. బుధవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం సాయంత్రమే యువతి సహా ఆమె కుటుంబ సభ్యులు ముథోల్‌కు చేరుకున్నారు. ఆ సమయానికి యువకుడు అదృశ్యం కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికారు. బుధవారం సాయంత్రం వరకు అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఉద్దేశ పూర్వకంగానే అతను పరారయ్యాడనే నిర్ధారణకు వచ్చిన యువతి తరఫు వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనికి వివాహం ఇష్టం లేదా? ఇల్లరికం వెళ్లడం ఇష్టం లేక పరారయ్యాడా? అనేది తెలియాల్సి ఉందని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని