దిల్లీలో మరోసారి కాల్పులు

తాజా వార్తలు

Updated : 02/02/2020 02:00 IST

దిల్లీలో మరోసారి కాల్పులు

దిల్లీ: దిల్లీలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న షాహిన్‌ బాగ్‌ ప్రాంతంలో ఈ సారి కాల్పులు జరిగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద జరిగిన కాల్పుల ఘటన మరవక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.

సీఏఏకి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా వందలాది మంది మహిళలు, చిన్నారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బారికేడ్లపైకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేస్తూ కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని