3 రోజుల్లో 31 కిలోల బంగారం స్వాధీనం

తాజా వార్తలు

Published : 03/02/2020 01:37 IST

3 రోజుల్లో 31 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల పాటు రైళ్లు, బస్సుల్లో  తనిఖీలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు.. మొత్తం నాలుగు కేసుల్లో 12 మంది ప్రయాణికులను అరెస్ట్‌ చేశారు. తనిఖీల్లో భాగంగా వారి నుంచి   రూ.13.03 కోట్ల విలువైన 31.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. జనవరి 31న అర్ధరాత్రి నెల్లూరు డీఆర్‌ఐ యూనిట్‌ అధికారులు చెన్నై నుంచి వరంగల్‌ వెళ్లే జైపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును విజయవాడలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్‌కు వెళ్తున్న ముగ్గురు ప్రయాణికుల వద్ద నుంచి రూ.3.05 కోట్ల విలువైన 7.228 కిలో గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. తాము నగదుతో చెన్నైలో కొనుగోలు చేసినట్లు ప్రయాణికులు చెప్పినప్పటికీ వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, ఆ బంగారమంతా విదేశాలకు చెందినది కావడంతో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి చెన్నై నుంచి వరంగల్‌ వస్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడలో స్థానిక డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా.. ముగ్గురు ప్రయాణికులు ఎలాంటి పత్రాలు లేకుండా రూ.2.99కోట్ల విలువైన 7.077 కిలో గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు  అధికారులు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌, విజయవాడ డీఆర్‌ఐ అధికారులు విజయవాడ మీదుగా వరంగల్‌ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును విజయవాడ కనకదుర్గ వారధి వద్ద తనిఖీ చేశారు. అనుమానితులుగా గుర్తించిన నలుగురు ప్రయాణీకుల వద్ద తనిఖీలు నిర్వహించగా వారిలో ముగ్గురు ప్రయాణీకులు బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి ఎలాంటి పత్రాలు లేని రూ.2.73 కోట్ల విలువైన 6.470 కిలో గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈనెల రెండో తేదీన ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ డీఆర్‌ఐ యూనిట్‌ అధికారులు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తున్న సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న ముగ్గురు ప్రయాణీకులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.4.53 కోట్ల విలువైన 10.709 కిలో గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని