బంతి కోసం వెళ్లి బాలుడు మృతి

తాజా వార్తలు

Published : 10/02/2020 00:54 IST

బంతి కోసం వెళ్లి బాలుడు మృతి

హైదరాబాద్‌: బంతి కోసం వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీ నగర్‌కు చెందిన ఎం‌. అఖిల్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో ఫిలింనగర్ కల్చరల్‌ సెంటర్‌లోని టెన్నిస్‌ కోర్టు వద్ద ఎవరికీ తెలియకుండా బంతులను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఎంఆర్‌సీ కాలనీవైపు ఉన్న గోడమీద నుంచి టెన్నిస్‌ కోర్టులోకి ప్రవేశించాడు. తన రెండు జేబుల్లో నాలుగు టెన్నిస్‌ బంతులు, చేతిలో మరో రెండు టెన్నిస్‌ బంతులతో గోడ దాటే క్రమంలో పక్కనే ఉన్న నియంత్రిక తగిలి గోడ మీద అలానే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి తండ్రి శేఖర్‌ ఐదు నెలల క్రితం మృతి చెందగా.. తల్లి యాదమ్మ ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. కుమారుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని