యూపీలో దారుణం...

తాజా వార్తలు

Published : 12/02/2020 14:46 IST

యూపీలో దారుణం...

కుమార్తె చేతిలో మాజీ సైనికోద్యోగి హతం

చావుబతుకుల్లో భార్య, కుమార్తె
ప్రేమ వ్యవహారమే కారణమా?

మథుర: తన టీనేజ్‌ కుమార్తె చేతిలోనే ఓ మాజీ సైనికోద్యోగి ప్రాణాలు కోల్పోయిన షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మథుర జిల్లాలోని మిత్తౌలీ గ్రామంలో నివసించే ఛేత్రామ్‌ సింగ్‌ (41) మృతిచెందగా ఆయన భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

ఛేత్రామ్‌ సింగ్‌ భారత సైన్యంలోని జాట్‌ రెజిమెంట్‌లో నాయక్‌గా పనిచేస్తూ ఆరు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. అలహాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న ఆయన కుమార్తె రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. కాగా, 13 ఏళ్ల ఛేత్రామ్‌ కుమారుడు మధురలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఛేత్రామ్‌ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ సైనికాధికారి... 38 సంవత్సరాల తన భార్య, 17 ఏళ్ల కుమార్తెలపై పిస్తోలుతో కాల్పులకు తెగబడ్డాడు. ఆ పై 13 ఏళ్ల కుమారుడిని కూడా కాల్చి చంపడానికి ప్రయత్నించబోయాడు. దీనిని ఆపటానికి ఆయన కుమార్తె ఛేత్రామ్‌పై కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మరణించాడు. ఒక బుల్లెట్‌ ఆయన భార్య కుడి కంటి పైనుంచి దూసుకుపోగా ...మరో బుల్లెట్‌ కుమార్తె ఉదరభాగంలో తగిలింది. 

ఘటనా స్థలంలో ఒక పిస్తోలు, కొన్ని బుల్లెట్లు, మూడు లైవ్‌, రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకొన్నట్లు మధుర డీఐజీ షలాభ్‌ మాథుర్‌ వివరించారు. ఛేత్రామ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపినట్టు ఆయన తెలిపారు. స్థానిక యువకుడితో కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఛేత్రామ్‌ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కుమార్తె, ఆమె ప్రియుడు కలసి ఆయన్ను కాల్చి చంపినట్టు ఛేత్రామ్‌ సోదరుడు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగిస్తున్నట్లు డీఐజీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని