పనివాళ్లుగా చేరారు.. రూ.కోటిన్నర దోచేశారు!

తాజా వార్తలు

Published : 13/02/2020 01:07 IST

పనివాళ్లుగా చేరారు.. రూ.కోటిన్నర దోచేశారు!

హైదరాబాద్‌: పనివాళ్లుగా ఇళ్లలో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బిహార్‌ రాష్ట్రం మదుబని జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు రామాశిష్‌ ముఖియా, భాగవత్‌ ముఖియా, భోళా ముఖియాల నుంచి రూ. 1.50 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు పూర్తి వివరాలను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాకు వెల్లడించారు.

‘పోలీసులు అరెస్టు చేసిన వారిలో బిహార్‌కు చెందిన భోలా ముఖియాది కీలక పాత్ర. వృత్తిరీత్యా ముఖియా డ్రైవర్‌. ఎప్పుడు, ఎక్కడ చోరీ చేయాలనేది ఇతడే నిర్ణయిస్తాడు. చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్న తర్వాత రెక్కీ నిర్వహించి ఒక కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకుంటారు. కొన్ని రోజుల పాటు అనేక విధాలుగా పరీక్షించిన తర్వాతనే దొంగతనం చేయాలని నిర్ణయిస్తారు. ఆ తర్వాత చోరీ చేయాలనుకునే సమయానికి 10 నుంచి 15 రోజుల ముందు మిగతా ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు. అనంతరం వారు కూడా రంగంలోకి దిగుతారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠాలో ఒకడు డ్రైవర్‌గా, ఇంట్లో పనివాడిగా అక్కడ చేరిపోతాడు. ఆ తర్వాత అనుకున్న విధంగా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు’’ అని వివరించారు. 

ముఠాను పట్టుకోవడంలో సమర్థంగా పనిచేసిన బంజారాహిల్స్‌ డీఐ కె.రవికుమార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ భూషణ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌, కానిస్టేబుల్‌ జయరాజ్‌, అహ్మద్‌, శివశంకర్‌, హోంగార్డ్‌ కిషన్‌ నాయక్‌లను సీపీ అంజనీ కుమార్‌ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని