ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడి.. ఆపై ఆత్మహత్య!

తాజా వార్తలు

Published : 14/02/2020 00:52 IST

ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడి.. ఆపై ఆత్మహత్య!

బరేలీ (యూపీ): అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెద్దలను ఒప్పించాడు. ఇష్టపడిన అమ్మాయినే మనువాడాడు. ఏమైందో ఏమో పెళ్లైన కొద్ది గంటలకే ఆ నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 
మేరట్‌కు చెందిన దుష్యంత్‌ గిరి (22) పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంకులో సేల్స్‌మేన్‌గా పనిచేసేవాడు. బరేలీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వివాహానంతరం ఇంటికి వస్తుండగా.. పెళ్లి బృందం దారిలో ఓ హోటల్‌ వద్ద ఆగింది. అక్కడ టీ ఆర్డర్‌ ఇచ్చిన గిరి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతడిని ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చి తాము ఇంటికి చేరుకున్నామని, అంతలోనే ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చారని దుష్యంత్‌ సోదరుడు వివరించారు.

అనుకోని ఈ ఘటనతో వధూవరుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే వివాహానంతరం కూడా దుష్యంత్‌ చాలా ఆనందంగా ఉన్నాడని, అతడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని వధువు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని