యువతిని రక్షించబోయి... ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 17/02/2020 01:46 IST

యువతిని రక్షించబోయి... ఇద్దరి మృతి

నారాయణపేట: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్‌ సమీపంలో (కర్ణాటక సరిహద్దు) కృష్ణానదిలో దిగి  ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పాలకొల్లుకు చెందిన రామకృష్ణరాజు, శ్రీహరి రాజు వారి బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఇవాళ ఉదయం బంధువులతో కలిసి సరదాగా కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. బంధువులు వెళ్లిపోయినా ఐదుగురు మాత్రం నదిలో స్నానాలు చేస్తూ గడిపారు. వారిలో ఓ అమ్మాయి కాలుజారి పడిపోగా  ఆమెను రక్షించేందుకు నలుగురు నదిలోకి వెళ్లారు. సమీపంలో ఉన్న జాలరి గోపాల్‌ ముగ్గురు అమ్మాయిలను రక్షించగా.. ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఎంత గాలించినా దొరక్కపోవడంతో  కృష్ణా మండల కేంద్రం నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. నదిలో విస్తృతంగా గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని