close
Array ( ) 1

తాజా వార్తలు

కోట్లు కొల్లగొడుతున్నారు

ఓఎల్‌ఎక్స్‌ వేదికగా అమ్మకాల పేరుతో మోసాలు
బాధితుల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు
రాయదుర్గం, న్యూస్‌టుడే

మేం మిలటరీలో అధికారులం.. విధుల రీత్యా ఇతర ప్రాంతాలకు బదిలీ అయింది.. అక్కడికి తీసుకెళ్లే వీలు లేక మా వాహనం తక్కువ ధరకే విక్రయించి వెళ్లాలనుకుంటున్నాం.. అని ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్లో ప్రకటనలు పోస్టు చేసి అమాయకులను నమ్మిస్తారు. వారి ఉచ్చులో చిక్కాక సైబర్‌ మోసగాళ్లు రూ.కోట్లు దండుకుంటున్నారు. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి కేసుల్లో రూ.13 కోట్ల 35 లక్షలకు పైగా దండుకున్నారు. ఈ తరహా మోసాల్లో రోజురోజుకూ బాధితుల నుంచి ఫిర్యాదులు అధికమవుతున్నాయి. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

ఉచ్చులోకి దించుతారిలా..
కార్లు, ద్విచక్రవాహనాలతోపాటు ఇతర విలువైన వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్లో ప్రకటనలిస్తారు. తాము మిలిటరీ అధికారులమని, బదిలీ అయిన నేపథ్యంలో వాటిని వెంట తీసుకెళ్లే వీలు లేక తక్కువ ధరకే అమ్మకానికి ఉంచినట్లు పేర్కొంటారు. ఖరీదైన, ఆకట్టుకునే ఫొటోలను పోస్టు చేస్తారు. ఉత్పత్తులను భౌతికంగా చూసుకోకుండానే వారిని విశ్వసించి సంప్రదించగానే సైబర్‌ మోసగాళ్లు బాధితుల నుంచి రూ.లక్షల్లో తమ ఈ వాలెట్లు, ఖాతాల్లో ఆన్‌లైన్‌ ద్వారా జమ చేసుకుని అందుబాటులో ఉండకుండా పోతారు. మిలిటరీ అధికారుల నకిలీ గుర్తింపు(ఐడీ) కార్డులను బాధితులకు పంపిస్తారు.

అవగాహనకు ప్రచారం
మూడు కమిషనరేట్‌ల పోలీసు అధికారులు సమన్వయంగా వ్యవహరిస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నేరగాళ్లను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ప్రతిచోటా కరపత్రాలను పంపిణీ చేయడమేకాక సినిమా థియేటర్‌లు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో క్రమం తప్పకుండా ప్రకటనలూ ఇప్పిస్తున్నామన్నారు. అయినా రోజురోజుకూ భారీ సంఖ్యలో ప్రజలు వారి ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారంటున్నారు. వెబ్‌సైట్లో వచ్చే పోస్టు ఎంత వరకు విశ్వసించదగిందో కూడా తెలుసుకోకుండానే తక్కువ ధరకు వస్తుందనే ఆశతో మోసగాళ్లు విసురుతున్న వలలో చిక్కుకుంటున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారానే మోసాలకు కళ్లెం వేయొచ్చంటున్నారు. ఇందుకు పలు సూచలను పాటించాలని అధికారులు చెబుతున్నారు.

* ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలిచ్చే ఉత్పత్తులను భౌతికంగా చూశాకే డబ్బు బదిలీ చేయాలి.
* విక్రయదారుగా ఆర్మీ అధికారుల పేరుతో ఐడీ కార్డులు పంపించగానే విశ్వసించకూడదు. అలా పంపారంటే వారు మోసగాళ్లనే అనుకోవాలి.
* వస్తువులు పంపించని పక్షంలో డబ్బు తిరిగి ఇచ్చేస్తామనే విషయాన్ని అసలే నమ్మకూడదు.
* వస్తువుకు సంబంధించిన ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, బిల్స్‌ చూసుకోవాలి.
* డబ్బు బదిలీ చేయాలని పంపించే క్యూఆర్‌ కోడ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ స్కాన్‌ చేయకూడదు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.