బంగారం ఎంతపని చేసింది!

తాజా వార్తలు

Published : 17/02/2020 11:19 IST

బంగారం ఎంతపని చేసింది!

తల్లి ఆత్మహత్య, కుమార్తె ఆత్మహత్యా ప్రయత్నం

ముంబయి: బంగారంపై వివాదం ఒక తల్లీకూతుళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ముంబయిలోని లోఖండ్‌వాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓషివాడా పోలీసుల కథనం ప్రకారం... 32 సంవత్సరాల మహిళ తన భర్త కలిసి లోఖండ్‌వాలాలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వారితోపాటు ఆ మహిళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆదివారం సదరు మహిళ అవసరం నిమిత్తం తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను బయటకు తీసింది. వాటిలో కొన్ని కనిపించకపోవటంతో తన తల్లే  వాటిని తీసిఉండవచ్చని అనుమానించింది. ఈ విషయంపై తల్లితో వాగ్వాదానికి దిగింది. ఒక దశలో ఆవేశానికి లోనైన కుమార్తె ఫినాయిల్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది.  దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్సానంతరం ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదే సమయంలో ఇంటివద్దనే ఉన్న ఆమె తల్లి (52) ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్మ చేసుకొంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వాచ్‌మన్‌కు సమాచారం తెలియచేశారు. మృతురాలి వద్ద ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని