close
Array ( ) 1

తాజా వార్తలు

క్షణికావేశం.. బస్సులో హత్యాయత్నం

బేగంబజార్‌, న్యూస్‌టుడే: వివాద కారణంగా రెచ్చిపోయిన ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులో సహ ప్రయాణికురాలిని కత్తితో పొడిచి పరారయ్యాడు. బేగంబజార్‌ ఎస్సై సుధాకర్‌ కథనం ప్రకారం.. మారేడ్‌పల్లికి చెందిన శిబ్లి కుమార్తె అనూరాధ(34) ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సెక్కారు. అఫ్జల్‌గంజ్‌ వైపు వెళ్లే ఆ బస్సు మొజాంజాహి మార్కెట్‌ వద్దకు చేరుకోగానే మహిళలకు కేటాయించిన సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఆ వ్యక్తి వచ్చి కూర్చోవడాన్ని ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు అసభ్య పదజాలంతో దూషించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తురాలైన ఆమె చెప్పుతో కొట్టడంతో వీరంగమాడిన ఆ దుండగుడు జేబులో నుంచి కత్తి తీసి పొడిచాడు. అరుపులు, కేకల కారణంగా డ్రైవరు వెంటనే బస్సును నిలిపివేశారు. అదే అదునుగా అతగాడు బస్సుదిగి పరారయ్యాడు. బాధితురాలిని నేరుగా అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి డ్రైవరు, కండక్టరు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టరు పీజీరెడ్డి వెంటనే ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బేగంబజార్‌ ఠాణా పరిధి కావడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి కేసును అక్కడికి బదలాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
VITEEE 2020
besttaxfiler
Saket Pranamam
dr madhu
HITS2020

Panch Pataka

దేవతార్చన