close
Array ( ) 1

తాజా వార్తలు

బ్లాక్‌మెయిలింగ్‌ కిలేడీ..!

అంతర్జాలం వేదికగా అమాయకులకు వల
ముందు స్నేహం.. ఆపై బెదిరింపులు..
వెలుగులోకి వస్తున్న యువతి బాగోతాలు

హైదరాబాద్‌: అంతర్జాలం ద్వారా అమాయకులను వలలో వేసుకుని ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ఓ లేడీ కిలాడీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్నేహం పేరుతో యువకులను తన ముగ్గులోకి దింపి వారితో శారీరకంగా దగ్గరవుతుంది. రహస్యంగా చిత్రీకరించిన వీడియోలతో బెదిరింపులకు పాల్పడి అందినకాడికీ దండుకుంటుంది. రెండు నెలల క్రితం జైలుకు వెళ్లిన సదరు మాయాలేడి ఇటీవల ఓ ఛానెల్‌ ద్వారా కేపీహెచ్‌బీకాలనీ పోలీసులపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె అనైతిక కార్యకలాపాలను పోలీసులు బహిర్గతం చేశారు. ఆమె సాగించిన బాగోతాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఇంజినీరింగ్‌ చదివానంటూ..
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన పతంగి మహేశ్వరీ(22) కేవలం పదోతరగతి వరకే చదివింది. ప్రస్తుతం కేపీహెచ్‌బీకాలనీ వసంత్‌నగర్‌లో తన తండ్రి వద్ద నివాసం ఉంటుంది. కట్టుకున్న భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి అతనికీ దూరంగా ఉంటుంది. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అడ్డదారులు తొక్కింది. తనకు వివాహం కాలేదని.. తాను బీటెక్‌ చదివానని నమ్మిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చింది. ఇది నిజమని నమ్మిన మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌కు చెందిన ఓ యువకుడు మహేశ్వరీ బారిన చిక్కుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ఇరువురు శారీరకంగా ఒక్కటయ్యేదాకా వచ్చింది. గతేడాది డిసెంబరు 14న వారిద్దరూ కేపీహెచ్‌బీకాలనీలోని ఓ హోటల్‌లో మూడు గంటలు గడిపారు. ఆ సమయంలో పథకం ప్రకారం రహస్యంగా వీడియోను చిత్రీకరించింది. తన స్నేహితుడైన సంతోష్‌ ద్వారా కూకట్‌పల్లి పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడింది. దీంతో బాధితుడు రూ. 4.50 లక్షలతోపాటు ఐఫోన్‌ సమర్పించుకున్నాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించడంతో డిసెంబరు 26న మహేశ్వరీ, సంతోష్‌లను అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.


ఆర్డీవో పేరుతో సాఫ్ట్‌వేర్‌ యువతికి గాలం

తాను ఆర్డీవోనని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్‌ యువతికే గాలం వేసింది. ఇక్కడ తాను యువకుడిగా చెప్పుకొని ఏకంగా వివాహం చేసుకుంటానని నమ్మించింది. ఫేస్‌బుక్‌లో కృష్ణహర్ష పేరుతో నకిలీ ఐడీని సృష్టించింది. అందులో తాను ఆర్డీవో ఉద్యోగం చేస్తున్నానని పేర్కొంది. ఇది నిజమని నమ్మిన ఓ సాఫ్ట్‌వేర్‌ యువతి తనను వివాహం చేసుకోవాలని అభ్యర్థించింది. అందుకు సరేనన్న నిందితురాలు అత్యవసరాలున్నాయని చెప్పి సదరు యువతి నుంచి రూ. 1.75 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా తన ఖాతాలో వేయించుకుంది. అదేవిధంగా వరంగల్‌లోని మరో యువకుడిని ప్రేమ పేరుతో గాలం వేసి అతని నుంచీ రూ. 4.45 లక్షలు వసూళు చేసింది. నిందితురాలు మహేశ్వరీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పోలీసులు అక్రమంగా ఇరికించారని, తనపై అత్యాచారం చేయబోయారని ఆరోపించింది. అంతేగాకుండా కేపీహెచ్‌బీ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై లోతైన విచారణ జరిపిన పోలీసులు ఆమె సాగించిన బాగోతాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నామని, దొరికిన తర్వాత ఆధారాలతో సహా ఆమెను మరోమారు న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి కిలేడీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేపీహెచ్‌బీకాలనీ సీఐ లక్ష్మీనారాయణ సూచించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.