close
Array ( ) 1

తాజా వార్తలు

ముసుగు దొంగలు యూపీ ముఠావారేనా?!

పంజాగుట్ట, న్యూస్‌టుడే: అమీర్‌పేట్‌ అపరాజిత కాలనీలో నందితా కపూర్‌ నివాసంలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, పంజాగుట్ట పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠాగా భావిస్తున్నారు. నందితా కపూర్‌పై దాడికి ఉపయోగించిన సుత్తిని అక్కడే వదిలి బయటకు వచ్చిన కాసేపటికి ముసుగులు తీసేసి పంజాగుట్ట చౌరస్తాకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఓ ఆటోలో ఖైరతాబాద్‌ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వారు ఎక్కిన ఆటో నెంబరు మార్చి ఉంటారని భావిస్తున్నారు. బాధితుల ఇంట్లో బిగించిన సీసీ కెమెరాలు పోలీసుల దర్యాప్తులో కొంతమేర దోహదపడ్డాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.