విశాఖలో అదృశ్యం.. బెంగళూరులో ప్రత్యక్షం!

తాజా వార్తలు

Published : 22/02/2020 00:19 IST

విశాఖలో అదృశ్యం.. బెంగళూరులో ప్రత్యక్షం!

విశాఖపట్నం: విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతుల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన యువతులు బెంగళూరులో ఉన్నట్లు విశాఖ పోలీసులు గుర్తించారు. యువతుల అదృశ్యంపై మూడు బృందాలను పోలీసులు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. యువతుల ఆచూకీ లభించడంతో వారిని విశాఖ తీసుకొస్తున్నారు.

ఈనెల 17న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అదృశ్యం కావడం విశాఖలో కలకలం రేపింది. తాము చనిపోతున్నామని.. వెతకవద్దంటూ తల్లి మొబైల్‌కు వారు మెసేజ్‌ పంపారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన యువతుల తల్లిదండ్రులు విశాఖలోని ద్వారకానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో యువతులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అయితే వారు ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయారు?చనిపోతున్నామని తల్లికి ఎందుకు మెసేజ్‌ పంపారనే విషయాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని