విమానం కూలి.. ఐఏఎఫ్‌ పైలట్‌ మృతి..!
close

తాజా వార్తలు

Published : 25/02/2020 00:49 IST

విమానం కూలి.. ఐఏఎఫ్‌ పైలట్‌ మృతి..!

పటియాలా: పంజాబ్‌లోని పటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పటియాలా ఏవియేషన్‌ క్లబ్‌కు చెందిన మైక్రోలైట్‌ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్‌ కమాండర్‌ దుర్మరణం పాలయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటియాలాలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్‌ క్లబ్‌కు చెందిన మైక్రో లైట్‌ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 3వ ఎయిర్‌ స్క్వాడ్రన్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ చీమ గుర్‌ప్రీత్‌సింగ్‌ మరణించారు. ఎన్‌సీసీ క్యాడెట్‌ విపిన్‌కుమార్‌ యాదవ్‌ గాయాల పాలయ్యారు. ఈ మైక్రో లైట్‌ విమానాల్ని ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణ కోసం ఉపయోగిస్తారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని