మలక్‌పేటలో పేలుడు: నలుగురికి గాయాలు

తాజా వార్తలు

Updated : 01/03/2020 10:00 IST

మలక్‌పేటలో పేలుడు: నలుగురికి గాయాలు

హైదరాబాద్‌: అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మలక్‌పేట అస్మన్‌ఘడ్‌లోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మూడంతస్థుల భవనంలో.. భవన యజమానితో పాటు కాపలాదారుడు అతని కుటుంబం నివసిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కాపలాదారుడి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయింది. దీనికి తోడు ఫ్రిడ్జ్‌ నుంచి నిప్పు రవ్వలు చెలరేగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కిటికీ, తలుపుల అద్దాలు, సమీపంలో నిలిపి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన భవనం సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌, ఇళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాపలాదారుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని