హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్ల కలకలం

తాజా వార్తలు

Updated : 01/03/2020 11:08 IST

హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్ల కలకలం

హైదరాబాద్‌: నగరంలో గ్యాస్‌ ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ పీఆండ్‌టీ కాలనీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో ఇంటి యజమానితో పాటు రమేష్‌, లక్షణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గ్యాస్‌ లీకైన వాసన రావడంతో సోదరులిద్దరూ కుటుంబ సభ్యులను బయటకు పంపారు. ఆ తర్వాత లైట్లు వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్‌ పేలడంతో ప్రమాదం జరిగింది. 

మలక్‌పేట ఘటనలో నలుగురికి గాయాలు..
అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మలక్‌పేట అస్మన్‌ఘడ్‌లోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మూడంతస్థుల భవనంలో.. భవన యజమానితో పాటు కాపలాదారుడు అతని కుటుంబం నివసిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కాపలాదారుడి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయింది. దీనికి తోడు ఫ్రిడ్జ్‌ నుంచి నిప్పు రవ్వలు చెలరేగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కిటికీ, తలుపుల అద్దాలు, సమీపంలో నిలిపి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన భవనం సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌, ఇళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాపలాదారుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని