పాఠశాల బస్సు బోల్తా :15మందికి గాయాలు
close

తాజా వార్తలు

Published : 11/03/2020 00:41 IST

పాఠశాల బస్సు బోల్తా :15మందికి గాయాలు

పెద్దపల్లి పట్టణం: పెద్దపల్లి జిల్లాలోని హనుమంతునిపేట శివారులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పెద్దపల్లిలోని మాస్టర్‌ సిద్దార్థ పాఠశాలకు చెందిన బస్సులో మంగళవారం ఉదయం వివిధ గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. హనుమంతునిపేట సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని