వైరస్‌ ఆంక్షలపై గొడవ

తాజా వార్తలు

Updated : 23/03/2020 01:32 IST

వైరస్‌ ఆంక్షలపై గొడవ

శ్రీలంక జైల్లో ఇద్దరు ఖైదీల మృతి

ఆరుగురికి గాయాలు

కొలంబో: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఆంక్షలను నిరసిస్తూ శ్రీలంకలోని అనురాధాపుర జైల్లో ఖైదీలు నిరసనకు దిగారు. శనివారం సాయంత్రం కొందరు ఖైదీలు గార్డులతో గొడవకు దిగగా, మరికొందరు తప్పించుకుని పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు ఖైదీలు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీలను బయటి వ్యక్తులు కలవడాన్ని (ములాఖత్‌) ప్రభుత్వం రద్దుచేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని