close
Array ( ) 1

తాజా వార్తలు

మాంసం వండలేదని మట్టుపెట్టాడు

రంపచోడవరం, జగ్గంపేట గ్రామీణం: చిరు కారణానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. జగ్గంపేట పోలీసులు, రంపచోడవరం వీఆర్వో గణపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంపచోడవరం మండలం సిరిగిందలపాడుకు చెందిన లక్ష్మి జగ్గంపేట మండలం మల్లిశాలలోని ఓ జీడిమామిడి తోటలో కాపలాదారురాలిగా పనిచేస్తున్నారు. సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేష్‌ కూడా అక్కడే పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ఒకేచోట ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగొచ్చిన వెంకటేష్‌ మాంసం కూర వండలేదని లక్ష్మిని కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆదివారం ఉదయం మృతిచెందింది. మృతురాలి కుమారుడు బాబూరావు తల్లి శరీరంపై ఉన్న గాయాలు చూసి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.