మద్యం దుకాణాలు తెరుస్తారంటూ నకిలీ జీవో
close

తాజా వార్తలు

Published : 01/04/2020 06:57 IST

మద్యం దుకాణాలు తెరుస్తారంటూ నకిలీ జీవో

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం దుకాణాలను తెరస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారుల పేరుతో నకిలీ జీవోను సృష్టించిన వ్యక్తి కె.సనీష్‌ కుమార్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. మద్యం దుకాణాలు మూసెయ్యాలంటూ సర్కారు మార్చి 22న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 28న సనీష్‌ కుమార్‌ సామాజిక మాధ్యమాల్లో కొవిడ్‌-19 పేరుతో ఉన్న ఖాతాను చూశాడు. అందులో మద్యం దుకాణాలు తెరుస్తున్నారంటూ పోస్ట్‌ కనిపించింది. దీన్ని ప్రభుత్వ జీవోగా మార్చి ఆయన స్నేహితుడు మద్యం దుకాణాల యజమానిగౌడ్‌కు పంపించాడు. గౌడ్‌ ఆయనకు తెలిసిన మిత్రులకు.. వారి ద్వారా మరింత మందికి బదిలీ కావడంతో రెండు గంటల్లోనే వందల వాట్సాప్‌ బృందాల్లో చక్కర్లు కొట్టింది. మద్యం దుకాణాలు తెరుస్తున్నారా? అంటూ ఫోన్లు రావడంతో అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టి 48 గంటల్లో నిందితులను గుర్తించారు. సనీష్‌ కుమార్‌ అలియాస్‌ సన్నీ నకిలీ జీవో సృష్టికర్తగా తెలిపే సాక్ష్యాలను సేకరించి మంగళవారం జైలుకు తరలించారు. ఉప్పల్‌లో ఉంటున్న సన్నీ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. స్నేహితుడికి లబ్ధి చేకూర్చేందుకు ఇలా చేశాడని సైబర్‌ క్రైమ్‌ ఎసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని