ప్రేమికుడే చంపాడు..
close

తాజా వార్తలు

Published : 01/04/2020 07:38 IST

ప్రేమికుడే చంపాడు..

హతురాలిది సిక్కిం సైబరాబాద్‌ పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

ఈనాడు, హైదరాబాద్‌:  దిశ ఘటన తర్వాత హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన తంగడపల్లి కేసు దాదాపుగా కొలిక్కి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి పైవంతెన కింద దారుణ హత్యకు గురైన మహిళది సిక్కిం రాష్ట్రమని సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ ఘటనకు నిందితుడి బంధువు సహకరించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు తీసుకొచ్చిన అద్దె ‘కారు’ను గుర్తించారు. అక్కడ సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రధాన నిందితుడి (25)ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి పిల్లలు, భర్త ఉన్నారు. నిందితుడు ఫేస్‌బుక్‌ ద్వారా మహిళకు పరిచయమైనట్లు, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. వీరిద్దరి మధ్య గొడవే ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రోజే మృతురాలిని ప్రధాన నిందితుడు ఇక్కడికి రప్పించాడని, తీవ్ర వాగ్వాదం జరిగి ఉంటుందని, అదే హత్యకు దారి తీసి ఉండొచ్చని, నిందితుడి బంధువు ఇందుకు సహకరించాడని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.

ఘటన జరిగిన రోజే నగరానికి.. శివారుల్లో మృతదేహాన్ని పారేసేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి పైవంతెన కిందకు నైలాన్‌ తాడు సాయంతో మృతదేహాన్ని దించారు. తలను బండరాయితో మోదీ.. దుస్తులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బంగారు ఆభరణాలను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు మహిళ అదృశ్యమైనట్లు సిక్కింలో కేసు నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని