ప్రియుడితో కలిసి భర్త హత్య
close

తాజా వార్తలు

Published : 07/04/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియుడితో కలిసి భర్త హత్య

భర్తతో రేణుక (పాతచిత్రం)

మదనపల్లె (నేరవార్తలు), న్యూస్‌టుడే: పథకం ప్రకారం భార్య తన ప్రియుడితో కలిసి భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన మదనపల్లె పట్టణంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఒకటో పట్టణ సీఐ తమీమ్‌ అహ్మద్‌ కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం (35). అతనికి 11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకతో ప్రేమ వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌సెంటర్‌ నిర్వహిస్తున్న బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో పాటు మదనపల్లెలోనే ఉన్న రేణుక ఓ పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి కె.నాగిరెడ్డితో పరిచయం పెంచుకుంది. దీంతో పాటు ఆ పార్టీలో మహిళా కార్యకర్తగా పనిచేస్తోంది. ఇటీవల బాలసుబ్రహ్మణ్యం తిరిగి మదనపల్లెకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాడు. తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించి ఆమెను మందలించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తన భర్తను వదిలించుకోవాలని నాగిరెడ్డితో ఆమె చెప్పింది. అతను తనకు తెలిసిన వారి లారీతో ఢీకొట్టించి చంపేందుకు పథకం వేశాడు. పదిరోజులుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు ఎక్కువగా ఉండటంతో రాత్రి 11గంటల సమయంలో పట్టణంలోకి వెళ్లి మాత్రలు తెచ్చుకోవాలని ఆమె బలవంతపెట్టింది. మందుల కోసం వెళ్లి వస్తుండగా లారీతో ఢీకొట్టించారు. ప్రమాదంలో బాలసుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మృతుడి సోదరుడు న్యాయవాది అయిన కె.రఘుపతి అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాల్మీకిపురం వద్ద లారీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పథకం ప్రకారమే బాలసుబ్రహ్మణ్యంను చంపేందుకు రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి, మరికొందరు పథకం వేసినట్లు బయటపడిందని సీఐ తెలిపారు. రేణుక, నాగిరెడ్డితో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

బాలసుబ్రహ్మణ్యం మృతదేహం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని