కరోనాతో 9నెలల గర్భిణి మృతి...

తాజా వార్తలు

Updated : 08/04/2020 01:33 IST

కరోనాతో 9నెలల గర్భిణి మృతి...

ముంబయి: కరోనా వైరస్‌ కాటుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి బలైంది. ముంబయిలోని నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న స్థితిలో శనివారం రాత్రి ముంబయిలోని బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితిని బట్టి కరోనా ఉండొచ్చని అనుమానించిన వైద్యులు ఆమెను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, అత్యవసర చికిత్స అందించారు. కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేశారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారటంతో... కొద్ది గంటల్లోనే మృతిచెందింది. గర్భంలోని శిశువు కూడా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం వెలువడిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, నాయర్‌ ఆస్పత్రికి తీసుకురావటానికి ముందు ఆమెను చేర్చుకోవడానికి రెండు ఆస్పత్రులు తిరస్కరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని