పేలిన సిలిండర్‌.. చెల్లాచెదురైన మృతదేహాలు

తాజా వార్తలు

Updated : 10/05/2020 12:20 IST

పేలిన సిలిండర్‌.. చెల్లాచెదురైన మృతదేహాలు

కుప్పం గ్రామీణం : చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లి గ్రామంలో గ్యాస్‌సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ వెల్డింగ్‌ దుకాణంలో రాళ్లను ఎత్తే క్రేన్‌కు వెల్డింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో వెల్డింగ్‌ చేస్తున్న కార్మికులు అఫ్సర్‌(30), ఎజాబ్‌ ‌(28) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రమై దూరంగా  చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో వెల్డింగ్‌ దుకాణం యజమాని గౌస్‌ బాషా, క్రేన్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను  ఆంబులెన్స్‌లో కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని