మద్యం మత్తులో కన్న తండ్రినే హతమార్చాడు 

తాజా వార్తలు

Published : 14/05/2020 00:48 IST

మద్యం మత్తులో కన్న తండ్రినే హతమార్చాడు 

బిజినేపల్లి(నాగర్‌కర్నూల్‌): మద్యం మత్తులో కన్నతండ్రినే హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ గాంధీనాయక్‌ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కావలి శ్రీనివాసులు మంగళవారం రాత్రి మద్యం మత్తులో తన తండ్రి కావలి కూర్మయ్య(65)తో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అసహనానికి గురైన శ్రీనివాసులు.. క్షణికావేశంలో గొడ్డలితో తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కూర్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సీఐ గాంధీనాయక్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని