మరణశిక్ష @జూమ్‌ యాప్‌!

తాజా వార్తలు

Published : 21/05/2020 03:25 IST

మరణశిక్ష @జూమ్‌ యాప్‌!

సింగపూర్‌: వీడియో కాలింగ్‌ యాప్‌ ‘జూమ్’‌ ద్వారా న్యాయస్థానం మరణశిక్ష విధించిన ఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. 2011 నాటి ఓ మాదక ద్రవ్యాల కేసులో దోషిగా తేలిన పునీతన్‌ గణేశన్(37) అనే వ్యక్తికి సింగపూర్‌లోని ఓ న్యాయస్థానం జూమ్‌ ద్వారా మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సింగపూర్‌లో అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. కాగా, నిందితుడు పునీతన్‌ మలేసియాకు చెందినవాడు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం వీడియో సమావేశం ద్వారా విచారణ జరిపినట్టు అధికారులు వివరించారు. 

అయితే కేసుల విచారణకు జూమ్‌ యాప్‌ను ఉపయోగించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా, తీర్పును వెలువరించేందుకు మాత్రమే జూమ్‌ యాప్‌ను వినియోగించారని... దీనిపై అభ్యంతరాలు లేవని దోషి తరఫు న్యాయవాది తెలిపారు. ఈ తీర్పును పైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌  ప్రారంభమైన నాటి నుంచి సింగపూర్‌లో అనేక కేసుల విచారణలు వాయిదా పడ్డాయి. అత్యవసర కేసుల విషయంలో వీడియో సమావేశాల ద్వారా విచారణ కొనసాగిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని