రియాక్టర్‌ పేలి ముగ్గురికి తీవ్రగాయాలు

తాజా వార్తలు

Published : 22/05/2020 01:44 IST

రియాక్టర్‌ పేలి ముగ్గురికి తీవ్రగాయాలు

బొల్లారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎన్‌ఎం లైఫ్‌ సైన్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని