ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం.. వేధింపులు

తాజా వార్తలు

Updated : 22/05/2020 08:42 IST

ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం.. వేధింపులు

ఘట్‌కేసర్‌: కొండాపూర్‌కి చెందిన గృహిణి(30)ని ఓ వ్యక్తి.. ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం చేసుకొని వేధింపులకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సదరు గృహిణికి కొంతకాలం క్రితం భరత్‌కుమార్‌ అలియాస్‌ చింటు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఎమ్మెల్సీ కొడుకునని ఆమెకు చెప్పాడు. వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇదే అదనుగా భావించిన భరత్‌కుమార్‌.. ఆమెను రూ.15లక్షలు ఇవ్వాలని వేధించాడు. ఇవ్వకపోతే ఇద్దరూ కలిపి తీసుకున్న ఫొటోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీఐ రఘువీర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని