
తాజా వార్తలు
అరచేతిని నరుక్కొని ఊరంతా తిరిగాడు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా దిగపొహండి ఠాణా పరిధిలో బి.తురుబుడి పంచాయతీలోని నరేంద్రపూర్ గ్రామంలో పి.సమేశ్వర రెడ్డి (20) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం ఇంటి పెరట్లో పదునైన ఆయుధంతో తన మణికట్టు నుంచి అరచేయిని నరుక్కున్నాడు. దాన్ని ఓ పాలీథిన్లో కవర్లో పెట్టుకొని ఊరంతా తిరిగాడు. గమనించిన కొందరు గ్రామస్థులు ఆయనను పట్టుకుని తెగిన అరచేతితో సహా రాత్రి దిగపొహండి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు రెడ్డిని స్థానిక ఎమ్కేసీజీ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్సలు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనకు పాల్పడిన యువకుడు మానసిక వ్యాధిగ్రస్థుడని తెలుస్తోంది.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు