అంగడిలో ట్రూకాలర్‌ డేటా!
close

తాజా వార్తలు

Published : 28/05/2020 02:30 IST

అంగడిలో ట్రూకాలర్‌ డేటా!

దిల్లీ: ట్రూకాలర్‌ డేటా పేరిట 4.75 కోట్ల మంది భారతీయుల వివరాలను ఓ సైబర్‌ నేరగాడు రూ.75 వేలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్టు సైబిల్‌(ఆన్‌లైన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ) గుర్తించింది. 2019 నుంచి వివరాలతో ఉన్న ఈ డేటాలో అందరి ఫోన్‌ నంబర్లు, స్త్రీ, పురుష వివరాలతో పాటు నగరం, మొబైల్‌ నెట్‌వర్క్‌, ఫేస్‌బుక్‌ ఐడీ వంటివన్నీ ఉన్నాయి. అయితే అది తమ అధికారిక డేటా కాదని, తమ డేటాబేస్‌ భద్రంగానే ఉందని ట్రూకాలర్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఎవరో విభిన్న మార్గాల్లో ఫోన్‌ నంబర్లు, వివరాలు సేకరించి వాటిని ట్రూకాలర్‌ డేటా పేరిట అమ్ముకునే ప్రయత్నం చేస్తుండొచ్చన్నారు. కాగా గత వారం పలు ఉద్యోగ వైబ్‌సైట్ల నుంచి సేకరించిన 2.9 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలను డార్క్‌నెట్‌లో ఉంచగా సైబిల్‌ గుర్తించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని