మాజీ మంత్రి కారు డ్రైవర్‌ ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 31/05/2020 00:50 IST

మాజీ మంత్రి కారు డ్రైవర్‌ ఆత్మహత్య

అచ్యుతాపురం: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్‌ నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా పరవాడ మండలం కలపాకలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వాలంటీరు వేధింపులే కారణం?
 ‘‘పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా గ్రామానికి చెందిన వాలంటీరు, వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఇల్లు నిర్మిస్తున్న స్థలం వేరొకరిదంటూ వాలెంటీరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులను కలిసి న్యాయం చేయమని కోరాను. ఎవరూ సహాయం చేయకపోగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేశారు. రూ.50వేలు ఇస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామని వాలంటీరు తేల్చిచెప్పాడు. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అని ఆడియో సందేశంలో నాయుడు తెలిపాడు. అనంతరం పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు ఎవరెవరు కారణమో పేర్లతో సహా తెలిపి, జరిగిన సంఘటనంతా వాట్సాప్‌ ఆడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై జి.లక్ష్మణరావు
ఘటనాస్థలికి చేరకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని