విరిగిపడ్డ కొండచరియలు.. 20 మంది మృతి

తాజా వార్తలు

Published : 03/06/2020 02:02 IST

విరిగిపడ్డ కొండచరియలు.. 20 మంది మృతి

గువాహటి: అసోంలో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో మంగళవారం 20 మంది మృతిచెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మృతుల్లో ఎక్కువ మంది దక్షిణ అసోంలోని బారక్‌ లోయ పరిధిలో ఉన్న మూడు జిల్లాలకు చెందినవారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. వీటి వల్ల దాదాపు 3.72 లక్షల మంది ప్రభావితమయ్యారు. 348 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని అసోం విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. 27వేల హెక్టార్లలో పంట నీట మునిగినట్లు తెలిపింది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని