షేక్‌పేట్ భూవివాదంపై కొనసాగిన విచారణ

తాజా వార్తలు

Published : 08/06/2020 01:27 IST

షేక్‌పేట్ భూవివాదంపై కొనసాగిన విచారణ

బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్రనాయక్‌ రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించి ఏసీబీ అధికారుల విచారణ రెండో రోజు కొనసాగింది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే రూ.15 లక్షలు తీసుకుంటుండగా షేక్‌పేట్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునరెడ్డి అనిశా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి షేక్‌పేట్‌ తహసీల్దార్ సుజాతను దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా అనిశా అధికారులు విచారించారు. సుజాత ఇంట్లో దొరికిన రూ. 30లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఎస్ఐ రవీంద్రనాయక్ తీసుకున్న డబ్బుకు సంబంధించిన వివరాలను అధికారులు ఆమె నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ భూవివాదానికి సంబంధించి తహసీల్దార్‌ సుజాత పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారిని కూడా అనిశా అధికారులు ప్రశ్నించారు.

భూ వివాదంలో నిన్న అనిశాకు పట్టుబడిన ఎస్ఐ రవీందర్ నాయక్, ఆర్‌ఐ నాగార్జున రెడ్డిని అనిశా అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ఇవాళ మరోసారి విచారించారు. ఈ మేరకు రూ. 1.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌ను అనిశా అధికారులు విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా పట్టుబడిన ఆర్‌ఐ నాగార్జునరెడ్డిని కూడా రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రేపు మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా తహసీల్దార్‌ సుజాతకు అనిశా అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..
అనిశా వలలో ఆర్‌ఐ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని