బ్యాంకులో అద్దాల తలుపుని ఢీకొని మహిళ మృతి

తాజా వార్తలు

Published : 17/06/2020 01:10 IST

బ్యాంకులో అద్దాల తలుపుని ఢీకొని మహిళ మృతి

ఎర్నాకుళంలో ఘటన

ఎర్నాకుళం: తొందరపాటుతో ఓ మహిళ తన ప్రాణాలను పోగొట్టుకుంది. బ్యాంకులోని అద్దాల తలుపుని ఢీకొని దురదృష్టవశాత్తు మృతి చెందింది. ఈ సంఘటన కేరళలోని ఎర్నాకుళంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బీనా పాల్ (40) అనే మహిళ పని మీద సోమవారం  పెరుంబవూర్‌ బ్యాంక్‌కు వచ్చింది. తన కారులోని ఓ వస్తువును తీసుకోవాలనే తొందరలో అద్దం తలుపుని గమనించకుండా వేగంగా వెళ్లి ఢీకొంది. దీంతో అద్దం పగిలి గాజు ముక్కలు ఆమె కడుపులో దిగబడ్డాయి. వెంటనే చికిత్స కోసం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించగా గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనంతా బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని