కరోనా సోకిన హంతకుడు పరారీ

తాజా వార్తలు

Published : 23/06/2020 01:17 IST

కరోనా సోకిన హంతకుడు పరారీ

ముంబయి: ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం ముంబయి సమీపంలోని థానేలో చోటుచేసుకుంది. కళ్యాణ్‌ మోహన్ ప్రాంతంలో నివసించే అతడు మే 30న తనతో సహజీవనం చేస్తున్న ఒకామెని హత్య చేశాడు. ఖడక్‌పాడా పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా సోకి బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడిని జూన్‌ 16న ఓ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించి, ముగ్గురు పోలీసులు కాపలా కాస్తున్నారు. అయినా, వారి కళ్లుగప్పి సోమవారం తప్పించుకున్నాడని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని