గరంమసాలా అనుకొని పురుగు మందు కలిపి...

తాజా వార్తలు

Published : 23/06/2020 01:13 IST

గరంమసాలా అనుకొని పురుగు మందు కలిపి...

చిత్తూరు: ఓ వృద్ధురాలు పొరపాటున చేసిన పని.. ఇద్దరి చిన్నారుల మృతికి కారణమైంది. కూరలో వేసుకునే గరం మసాలా బదులు పురుగుల మందు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఎ.ఎల్‌.పురం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు కూర వండేటప్పుడు గరం మసాలా అనుకుని కూరలో పురుగుమందు గుళికల పొడి కలిపేసింది. ఆ ఆహారం తిన్న వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే ఆహారం తిన్న వృద్ధురాలి ఇద్దరు మనవళ్లు రోహిత్‌ (11), జీవన్‌ (8) మృతి చెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని