కారును ఢీకొన్న గూడ్స్‌ రైలు: ఒకరి మృతి

తాజా వార్తలు

Published : 28/06/2020 01:12 IST

కారును ఢీకొన్న గూడ్స్‌ రైలు: ఒకరి మృతి

ఎర్రగుట్ల: కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై.కోడూరు వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌ దాటుతుండగా సాంకేతిక లోపంతో కారు ట్రాక్‌పై  నిలిచిపోయింది. 

కారు ఆగిపోయిన వెంటనే క్షణాల్లో అటుగా వచ్చిన గూడ్స్‌ రైలు ఇంజిన్‌ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. గూడ్స్‌ రైలు ఇంజిన్‌ భారతీ సిమెంట్‌ పరిశ్రమలో వ్యాగిన్లను వదిలి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని