చిత్తూరు జిల్లాలో  ప్రమాదం: ఐదుగురి మృతి

తాజా వార్తలు

Published : 03/07/2020 22:13 IST

చిత్తూరు జిల్లాలో  ప్రమాదం: ఐదుగురి మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభంవారిపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  చెరువు కట్టపై వ్యాను, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను పీలేరులోని ఆస్పత్రికి తరలించగా.. మరో వ్యక్తి చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకి చేరగా.. వీరిలో ముగ్గురు మహిళలే ఉన్నారు. మృతులంతా కలకడ మండలం కొత్తగాండ్లపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా పీలేరు ఆస్పత్రిలో చనిపోయిన బంధువు చివరి చూపునకు వెళ్లి వస్తుండగా ఈ  విషాదం చోటుచేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని