అంకుల్‌.. మా డాడీని కొట్టొద్దు..
close

తాజా వార్తలు

Updated : 15/07/2020 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకుల్‌.. మా డాడీని కొట్టొద్దు..

 స్థల వివాదంలో కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యం
 బాధితుడిని కర్రలతో చితకబాదిన వైనం
 ఘటనా స్థలంలో విలపించిన చిన్నారి
 హెచ్‌ఆర్‌సీ నోటీసులతో స్పందించిన పోలీసులు

గొడవ పడుతూ..

మేడిపల్లి (బోడుప్పల్‌), నారాయణగూడ, న్యూస్‌టుడే: బోడుప్పల్‌ నగర పాలక సంస్థ 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ బందారం అంజలిదేవి భర్త శ్రీధర్‌గౌడ్‌ దౌర్జన్యంపై బాధితులు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. బోడుప్పల్‌ ద్వారకానగర్‌ ఫేజ్‌-2లో బి.పురంధర్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం బ్యాంక్‌ ద్వారా ఇంటిని కొనుగోలు చేశాడు. తమ స్థలంలో ఇల్లు నిర్మించారని బందారం కుటుంబానికి చెందిన వ్యక్తులు తరచూ పురంధర్‌రెడ్డితో గొడవ పడేవారు. శుక్రవారం శ్రీధర్‌గౌడ్‌, 12 మంది కుటుంబ సభ్యులతో వచ్చి కర్రలతో పురంధర్‌రెడ్డిపై దాడి చేశారు. దాడి నుంచి తప్పించుకొనేందుకు ఇంటి ప్రధాన గేట్‌కు తాళం వేయగా.. గేట్‌, గోడలు దూకి వచ్చి తీవ్రంగా కొట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సరిగా స్పందించకపోవడంతో పురంధర్‌రెడ్డి భార్య భానోదయ.. హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను అందజేసింది. ‘అంకుల్‌.. మా డాడీని కొట్టొదు’ అంటూ పురంధర్‌రెడ్డి బిడ్డ రోదనతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పాటు కమిషన్‌ నోటీసులతో పోలీసులు స్పందించారు. పురంధర్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కార్పొరేటర్‌ భర్త బందారం శ్రీధర్‌గౌడ్‌తో పాటు బందారం నాగేశ్‌గౌడ్‌, బుత్కూరి శ్రీరాములు, లక్ష్మణ్‌గౌడ్‌, రాముగౌడ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ అలియాస్‌ రాజు, రాఘవేందర్‌లపై కేసు నమోదు చేశారు. రాఘవేందర్‌, రాముగౌడ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ అలియాస్‌ రాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్పొరేటర్‌ భర్త శ్రీధర్‌గౌడ్‌తో పాటు మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వెంబడిస్తూ.. వెంటాడుతూ..

కర్రలతో కొడుతూ..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని