బతికుండగానే ఫ్రీజర్‌ బాక్సులో పెట్టేశారు
close

తాజా వార్తలు

Published : 15/10/2020 08:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బతికుండగానే ఫ్రీజర్‌ బాక్సులో పెట్టేశారు

వృద్ధుడికి నరకం చూపిన బంధువులు

సేలం: ప్రాణాలతో ఉన్న వృద్ధుడిని మృతి చెందాడని చెప్పి ఫ్రీజర్‌ బాక్సులో ఉంచిన ఘటన సేలంలో చోటు చేసుకుంది. సేలం కందంపట్టిలో ఉన్న పాత హౌసింగ్‌ బోర్డుకి చెందిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్య కుమార్‌ (78). అతడు తన సహోదరుడు శరవణన్‌, సహోదరి కుమార్తెలు గీత, జయశ్రీతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్య కుమార్‌ చనిపోయినట్లు తెలిపి సోమవారం ఫ్రీజర్‌ బాక్సు కోసం శరవణన్‌ సమాచారం ఇచ్చాడు. అనంతరం సిబ్బంది ఆ బాక్సును శరవణన్‌ ఇంటికి తీసుకెళ్లి మంగళవారం మధ్యాహ్నం వస్తామని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వారు అక్కడికి వెళ్లారు. అప్పుడు బాలసుబ్రహ్మణ్య కుమార్‌ కదలడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రాణాలు పోయేంత వరకు ఫ్రీజర్‌ బాక్సులో ఉంచాలని భావించారని తెలిసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫ్రీజర్‌ బాక్సులో ఉన్న వృద్ధుడిని చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాలసుబ్రహ్మణ్య కుమార్‌ తీవ్ర అనారోగ్యం పాలవడంతో చనిపోయాడని బంధువులకు శరవణన్‌ తెలిపినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని